అక్షరటుడే, ఎల్లారెడ్డి : లింగంపేట మండల కేంద్రంలో గురువారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement