అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో పార్క్ చేసిన బైక్ చోరి అయింది. నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన రాజు తన భార్యకు డయాలసిస్ చేయించడానికి సోమవారం ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రి ఆవరణలో బైక్ పెట్టి లోనికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.