Advertisement
అక్షరటుడే, ఇందూరు: నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఛైర్మన్ పి.శ్రీనివాస్, లయన్స్ క్లబ్ పూర్వాధ్యక్షుడు ఇరుమల శివలింగం, చింతల గంగాదాస్, కోశాధికారి పి.రాఘవేందర్, సాయికుమార్ పాల్గొన్నారు.
Advertisement