అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని హుస్నాబాద్ గల్లీలో పటాకులు కాలుస్తుండగా.. పూలకుండి పేలి దినేష్ చంద్ర అనే బాలుడికి గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వ్యాపారులు నాసిరకం పటాకులు విక్రయించడంతోనే ఘటన చోటు చేసుకుందని బాధితుడి బంధువులు ఆరోపించారు.