అక్షరటుడే, హైదరాబాద్: మేడ్చల్ లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని జాతీయ రహదారిపై అందరూ చేస్తుండగానే.. ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా నరికి చంపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేష్(25) తన కుటుంబ సభ్యులతో మేడ్చల్ లో నివాసం ఉంటున్నారు. కాగా, ఆదివారం పట్టపగలే జాతీయ రహదారి నడిరోడ్డు పై ఉమేష్ ను కత్తులతో కిరాతకంగా పొడిచి హతమార్చారు. అనంతరం హంతకులు దర్జాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉమేష్ భార్యాపిల్లలు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

Advertisement