family bond | మంటగలిసిన పేగుబంధం.. ఆస్తి ఇవ్వలేదని తండ్రికి కొరివిపెట్టని కొడుకు

family bond | మంటగలిసిన పేగు బంధం..మొత్తం ఆస్తి ఇవ్వలేదని తండ్రికి కొరివి పెట్టని కొడుకు
family bond | మంటగలిసిన పేగు బంధం..మొత్తం ఆస్తి ఇవ్వలేదని తండ్రికి కొరివి పెట్టని కొడుకు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: family bond : డబ్బు ముందు మానవత్వం మంట గలుస్తోంది. కుటుంబ విలువలు దిగజారి పోతున్నాయి. పేగు బంధం తెగిపోతోంది. తన పేరున మొత్తం ఆస్తి రాసివ్వలేదని ఓ సుపుత్రుడు తన తండ్రికి కొరివిపెట్టని ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ (Survey and Lands Records Department)లో అసిస్టెంట్ డైరెక్టర్(assistant director)గా పని చేసి రిటైర్​ అయ్యారు. పిల్లల పెళ్లిళ్లు చేశారు. భార్యను కోల్పోయిన తర్వాత మిగతా జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని భావించారు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్ కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదు ఇచ్చారు. మహబూబ్ నగర్ లో ఉన్న ఇంటిని మాత్రం తన ఇద్దరు కుమార్తెల పేరుపై రిజిస్టర్ చేశారు.

కాగా, మాణిక్యరావు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెలు హైదరాబాద్లో ఉన్న తమ అన్నయ్య గిరీష్ కు సమాచారం ఇచ్చారు. అయితే, అతను మాత్రం తండ్రి అంత్యక్రియలకు రావడానికి నిరాకరించాడు. కారణం ఏంటంటే, ఆ ఇల్లు తనకు ఇవ్వలేదన్న కోపం అట. “ఇంటిని నాకు ఇవ్వలేదు కాబట్టి, అంత్యక్రియలకు నేను రాను” అంటూ తేల్చి చెప్పాడట.

ఎంత నచ్చజెప్పినా గిరీష్​ వినకపోవడంతో.. చివరికి కుమార్తెలే తనయులయ్యారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు అండగా నిలిచారు. బంధువులు, మిత్రులతో కలిసి తండ్రిపై నిజమైన గౌరవం చాటుతూ తుదిచర్యలు చేపట్టారు. తండ్రి అంతిమయాత్రకు చిన్న కూతురు రాజనందిని ముందు నడిచింది.

Advertisement