అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బస్టాండ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పెర్కిట్ గ్రామానికి చెందిన సుద్దపల్లి గంగాధర్ (55) మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.