అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలో సోమవారం మధ్యాహ్నం త్రుటిలో ప్రమాదం తప్పింది. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని రుక్మిణి కుంట ప్రాంతంలో విద్యుత్ స్థంబాన్ని కారు ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో స్తంభంపై మంటలు చెలరేగాయి. స్థంభం విరిగి కారుపై పడింది. ఆ సమయంలో అటువైపుగా ఎవరు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే పార్క్ చేసిన బైకు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement