అక్షరటుడే, జుక్కల్: రహదారిపై కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటన నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా సమీపంలో సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరుకు చెందిన ఐదుగురు వ్యక్తులు జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా నర్సింగరావు పల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై కుక్క అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోయి పక్కనే చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి కారుబోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్నవారు పిట్లం మండలానికి చెందిన వారిగా సమాచారం.