అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు వ్యవహారం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హిడెన్‌బర్గ్ రిపోర్ట్ పైన దర్యాప్తు చేపట్టాలని విశాల్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం రూ.2,200 కోట్ల లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.