అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. అదానీ అనుబంధ కంపెనీలు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి అక్రమల మార్గాల నిధులు సమకూర్చినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో 600 డాలర్ల బాండ్ ఆఫర్ ను అదాని గ్రీన్ సంస్థ రద్దు చేసుకుంది. ఈ వార్తతో భారత స్టాక్ మార్కెట్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలు గురువారం భారీగా పడిపోయాయి. పలు కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.