Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. నిర్మల్ కు చెందిన సుశీల తన మనువడి అక్షరాభ్యాసం కోసం శుక్రవారం బాసరకు వచ్చారు. గోదావరి నదిలో స్నానం అనంతరం, ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ఎదుట వేచి ఉన్న క్రమంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement