అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD MLA | జిల్లాలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(mla dhanpal surya narayana), సీపీ సాయి చైతన్య(cp sai chaitanya)ను కోరారు. పోలీస్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో లా అండ్ ఆర్డర్(law and order)ను అదుపు చేయడంలో భాగంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్పాత్ కబ్జాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సామాన్యులకు అండగా నిలవాలని కోరారు.