అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ రష్మీశుక్లాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రష్మిశుక్లా స్థానంలో వివేక్ ఫన్సాలర్ తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రష్మీని బీజేపీ డీజీపీగా మారారని పేర్కొంటూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ డీజీపీపై బదిలీవేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు పార్టీలకు అతీతంగా తమ విధులను నిర్వహించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపాలని సీఎస్‌ని ఈసీ కోరింది. కాగా, రాష్ట్రంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.