అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నేడు కీలక విచారణ జరుగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. నేడు కోర్టులో జరుగనున్న విచారణ కవిత బెయిల్‌ విషయంలో కీలకం కానుంది. అయితే డిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఇటీవల న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంతో కవితకు కూడా రావొచ్చనే గులాబీనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌నేతలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, డాక్టర్‌ సంజయ్‌, బిగాల గణేశ్‌గుప్తాతో పాటు మరికొందరు నాయకులు ఢిల్లీ చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.