అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం మతిస్థిమితం లేని యువతి తన నవజాత శిశువును చెత్త కుండీలో పారవేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది గమనించి వైద్యులకు సమాచారం అందజేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ ఆధ్వర్యంలో శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. అంతకుముందు చిన్నారికి స్వతంత్ర అని నామకరణం చేశారు.