అక్షరటుడే, పెద్దపల్లి: ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్‌డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఐక్యతను దెబ్బతీసేందుకు గత ప్రభుత్వం కార్మిక సంఘాలను నిషేధించిందన్నారు. ప్రశ్నించే కార్మిక సంఘాలు లేకపోవడంతో కార్మికులపై పనిభారం పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా వెంటనే ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు

Advertisement
Advertisement
Advertisement