అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో మద్యం సేవించిన ఓ యువకుడు కారుతో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. మృతుల్లో ఇద్దరు దంపతులు కాగా.. భార్య నిండు గర్భిణి.. వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌస్‌లో శనివారం రాత్రి మద్యంసేవించిన యువకుడు కారులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఆటో, బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న నందినగర్‌కు చెందిన భార్యాభర్తలు మోనా, దినేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరికి ఏడాది క్రితమే వివాహం కాగా.. ప్రస్తుతం మోనా గర్భవతి. ఘటనకు కారణమైన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.