అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తన పేరు లేదని ఓ రైతు గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. బుట్టాయిగూడెంకు చెందిన రైతు కుమ్మరి నాగేశ్వరరావు ప్రజాపాలనలో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వ పథకాలకు అర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అర్హుల జాబితాలో తన పేరు రాకపోవడంతో నాగేశ్వరరావు మనస్తాపానికి గురై అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. దీంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement