అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని సారంగాపూర్ శివారులో గల సల్మాన్‌ఖాన్ ఇంట్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో గల సామగ్రి కాలిబూడిదైంది. విషయం తెలుసుకున్న ఎంఐఎం నాయకులు బాధితుడి ఇంటికి చేరుకుని పరామర్శించారు. తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. అలాగే తహశీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని కోరారు. పరామర్శించిన వారిలో ఎంఐఎం నాయకులు ఇద్రిస్ ఖాన్, రియాజ్, అమర్, షకీల్ తదితరులున్నారు.