Advertisement

అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బ్రహ్మపురి బడా రాంమందిర్‌ గోశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఆవులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాలనీవాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  YOUTH EXCHANGE | ముగిసిన యువ ఎక్స్చేంజ్