అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని మదీనా కాలనీలో మంగళవారం వీధి కుక్కల దాడిలో చిన్నారి ఫైజాకు(5) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను గాయపరుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.