అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్యనగర్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఇందులో మొత్తం నాలుగు ఫిర్యాదులు అందాయి. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఛైర్మన్ నారాయణ తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజాగౌడ్, డీఈ శ్రీనివాస్, ఏడీఈ వీరేశం, ఏడీఏ చంద్రశేఖర్, ఏఈలు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.