అక్షరటుడే, ఇందూరు: నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మెడికవర్, నిజామాబాద్ ఆస్పత్రి సౌజన్యంతో బుధవారం పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, బస్వారెడ్డి, శంకర్ నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 370 మంది సిబ్బందికి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్, బోధన్, ఎస్‌బీ ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్ రావ్, ఆర్‌ఎస్సైలు తిరుపతి, శ్రీనివాస్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ సరళ, దేవాగౌడ్, వైద్యులు సందీప్ రావ్, ప్రశాంత్, దత్తు రాజు, కౌశిక్, రామకోటేశ్వర రావ్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షకీల్ పాషా పాల్గొన్నారు.
Advertisement
Advertisement