Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: తల్లి మందలించిందని ఓ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన మెరికాడి సంజన(15) పదో తరగతి చదువుతోంది. గత 10 రోజులుగా సంజన పాఠశాలకు వెళ్లడం లేదు. సరిగా చదవడం లేదని ఉపాధ్యాయుడి ద్వారా తెలుసుకున్న తల్లి లక్ష్మి ఈ విషయమై తన కూతురిని మందలించింది. అనంతరం ఆమె బయటకు వెళ్లి మధ్యాహ్నం వచ్చేసరికి సంజన బెడ్ రూంలో ఉరి వేసుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  INTER EXAMS | ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు