అక్షరటుడే, వెబ్డెస్క్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంచులో 47 మంది చిక్కుకుపోయారు. చమోలి-బద్రినాథ్ రహదారిపై హిమానీనదం బరస్ట్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement