అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని అన్నసాగర్ గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక అధికారి, ఎంఈవో వెంకటేశం రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాను చదివి వినిపించారు. అలాగే జాబితాలో పేర్లురాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజు, వ్యవసాయాధికారి రాజా గౌడ్, అధికారులు సుధాకర్, నరేష్, గోపాల్ ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.