అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy | వారంతా పూర్వ విద్యార్థులు.. దాదాపు 47 ఏళ్లకు అంతా ఒక్కచోట కలిశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇందుకు వేదికగా మారింది. కామారెడ్డిలోని జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 1978 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఈఎన్‌సీ ఆర్ శ్రీధర్, రిటైర్డ్ హెచ్‌ఎం భూమయ్య, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రిటైర్డ్ సీనియర్ మేనేజర్ సునీల్ కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రాజేశ్వర్, బాల్ కిషన్, ట్రాన్స్‌కో రిటైర్డ్ ఈఈ రామలింగం, ప్రముఖ వ్యాపారులు మధుసూదన్, వెంకటరమణ, వెంకటేశం, రాజేందర్, టౌన్ ప్లానింగ్ రిటైర్డ్ ఏడీ భీమ్‌రావు, పీసీబీ రిటైర్డ్ జాయింట్ చీఫ్ ఈఈ గంగాధర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డా రమేష్, ఎన్‌ఎల్‌సిఐఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ మధు, జర్నలిస్ట్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Kamareddy | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Advertisement
Advertisement