అక్షర టుడే, వెబ్ డెస్క్ : లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చీకట్లో రైల్వే ట్రాక్ దాటుతున్న 60 ఏనుగుల బృందం సురక్షితంగా బయటపడింది. కాగా ఈఘటన వైరల్‌గా మారింది. అస్సాంలోని హబీపూర్ – లమ్సాఖంగ్ మధ్య అర్ధరాత్రి ఏనుగుల గుంపు ట్రాక్ దాటుతుండగా ఏఐ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా లోకోపైలట్‌కు అలర్ట్ మెసెజ్ వచ్చింది. లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులను వేశారు. రైలు నిలిపిన అనంతరం రైలులైట్ల వెలుతురులో పరిశీలించగా పట్టాలుదాటుతున్న ఏనుగు గుంపును గమనించారు. తర్వాత ప్రయాణికులతో కలిసి ఆఏనుగులను తరిమారు. తర్వాత రైలు ముందుకు వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐఏఎస్ సుప్రియా సాహు ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రమాదాల నివారణలో టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించారు.