అక్షరటుడే, కామారెడ్డి: Half Marathon : చైల్డ్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ కామారెడ్డి పట్టణంలో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్ ను నిర్వహించారు. పద్మపాని సొసైటీ, లిటిల్ స్కాలర్స్ ఆర్కే విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మారథాన్‌కు విశేష స్పందన లభించింది. క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పాత రాజంపేట వరకు మారథాన్ చేపట్టారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ స్వర్ణలత, విద్యాసంస్థల ప్రతినిధులు, సీఐ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.