అక్షరటుడే, వెబ్ డెస్క్: మహబూబాబాద్ కలెక్టరేట్‌లో గన్‌తో కాల్చుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రెజరీ స్ట్రాంగ్‌రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న గుండెబోయిన శ్రీనివాస్ ఎస్‌ఎల్‌ఆర్ గన్‌తో గుండెపై కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.