అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో శనివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులను పరీక్షించి జలుబు,దగ్గు తదితర రోగాలకు మందులు అందజేశారని ప్రిన్సిపల్ నళిని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వప్న, డాక్టర్ స్వప్న, సుల్తానా, వెంకటరెడ్డి, గంగుబాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.