Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కర్నాటకలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూరగాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడి పది మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో లారీలో 28 మంది ఉన్నట్లు సమాచారం. 15 మంది వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Advertisement