అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌లో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ జరిపినట్లు తేలడంతో పోలీసులు విచారణకు ఆదేశించారు.