Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: నటుడు సోనూసూద్​కు పంజాబ్​లోని లూథియానా కోర్టు అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు రాకపోవడంతో అరెస్టు చేసి, హాజరు పర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ కన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కేసు వేశాడు. ఈ కేసులో నటుడు సోనూసూద్​ను సాక్షిగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పడానికి సోనూసూద్​ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు సమన్లు పంపినా కోర్టుకు హాజరవ్వకపోవడంతో అరెస్ట్​ వారెంట్ జారీ చేసింది.

స్పందించిన సోనూసూద్​

లూథియానా కోర్టు అరెస్ట్​ వారెంట్​ జారీ చేయడంపై సోనూసూద్​ స్పందించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందొద్దని కోరారు.

Advertisement