అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మాదాపూర్ లో పెను ప్రమాదం తప్పింది. సిద్దిక్ నగర్ లో మంగళవారం రాత్రి ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో అందులో ఉన్నవారు భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం పక్కనే మరో నిర్మాణం చేపట్టేందుకు పెద్ద గుంత తవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భవనంలోని వారితో పాటు చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు.