అక్షరటుడే, జుక్కల్‌: భార్య, పిల్లల నుంచి తనను రక్షించాలంటూ పిట్లం మండల కేంద్రానికి చెందిన మంచి రవీందర్‌ నాథ్‌ శుక్రవారం పిట్లం పోలీసులను ఆశ్రయించారు. తనకు వారి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. లింగంపేట మండలానికి చెందిన ఓ మహిళతో తనకు వివాహం జరిగిందని, తమకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2009లో విడాకులు కూడా తీసుకున్నామన్నారు. విడాకులు తీసుకున్నా కూడా తాను ఇంట్లో లేని సమయంలో భార్య, తన ఇద్దరు కుమారులు ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తనను నిత్యం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement