అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగర మేయర్‌ నీతూకిరణ్‌ భర్త దండు శేఖర్‌పై ఓ వ్యక్తి దాడి చేశారు. సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న ఆయన వద్దకు ఓ వ్యక్తి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఆయనను కొట్టడంతో పాటు సుత్తెతో దాడికి దిగాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శేఖర్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.