అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ వ్యక్తి తన భార్య పిల్లలనే హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో చోటు చేసుకుంది. నీ విజయానికి భార్య అడ్డుగా ఉందని రాజేంద్ర గుప్తా అనే వ్యక్తికి ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. నిజమని నమ్మిన వ్యక్తి సోమవారం అర్ధరాత్రి భార్య నీతు గుప్తా(45), కుమారులు నవేంద్ర గుప్తా(25), సుబేంద్ర గుప్తా (15), కుమార్తె గౌరాంగి గుప్తా(16)ను కాల్చి చంపాడు.