అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని అహ్మద్పురా(Ahmedpura)లో చోటు చేసుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్పురాకు చెందిన షేక్ రఫత్(Sheikh Rafat) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన అతడు రోజూ మద్యం తాగి(drunk every day) ఇంటికి వస్తుండేవాడు. కాగా.. మంగళవారం సాయంత్రం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు.
ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై ఇంట్లోని కత్తితో పొడుచుకున్నాడు. భార్య రేష్మాబేగం(Reshma Begum) వెంటనే అతడిని జీజీహెచ్(GGH)కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.