అక్షరటుడే, బాన్సువాడ: మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై కృష్ణ కుమార్ కథనం ప్రకారం.. మోస్రా మండల కేంద్రానికి చెందిన హంగిర్గా మహేశ్(40) మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో కుటుంబీకులు మద్యం మానేయాలని మందలించడంతో మంగళవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.