అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మటన్ కోసం మార్కెట్కు వెళ్లి తిరిగివస్తూ ఆటో ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సబ్దల్పూర్నకు చెందిన గడ్డం పోచయ్య గురువారం హోలీ సందర్భంగా మటన్ కోసం ఎల్లారెడ్డికి వచ్చాడు.
అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా గాంధీచౌక్ వద్ద ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రుడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.