అక్షరటుడే, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో భార్య కూతురితో కలిసి ఓ వ్యక్తి గోదావరిలో దూకాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసరలో బుధవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని న్యాల్‌కల్ రోడ్డుకు చెందిన ఉప్పలించి వేణు, అనురాధ దంపతులు. వారికి కూతురు పూర్ణిమ ఉంది. వీరు ముగ్గురు నదిలో దూకగా స్థానికులు అనురాధను కాపాడారు. వేణు, పూర్ణిమ గల్లంతయ్యారు. గంజ్‌లో ఉన్న ఇద్దరు వ్యాపారుల వద్ద వేణు రూ.మూడు లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు కట్టాలని వారు ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చామని అనురాధ తెలిపింది. పోలీసులు వేణు మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. పూర్ణిమ కోసం గాలిస్తున్నారు. సీఐ మల్లేష్, ఎస్సై గణేష్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.