అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: గంజాయి విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని ఖిల్లా రోడ్డులో షేక్‌ అస్లాం అనే వ్యక్తి మంగళవారం రాత్రి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ డీసీబీ నాయక్‌ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో అస్లాం వద్ద నుంచి 260 గ్రాముల గంజాయితో పాటు మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. అస్లాంపై గతంలోనూ మూడు గంజాయి కేసులు ఉన్నాయని సిబ్బంది తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ వెంకటేశ్‌, ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది భూమన్న, శ్రీనుప్రసాద్‌, రాజన్న, ఆశన్న, అవినాష్‌ పాల్గొన్నారు.