అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: మద్యం సేవించి బైక్‌ నడిపిన వ్యక్తికి మూడురోజుల జైలుశిక్ష పడింది. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో వాహనాల తనిఖీల్లో భాగంగా శ్రీనివాస్‌ అనే వ్యక్తి మద్యం తాగి బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని బుధవారం కోర్టు ఎదుట హాజరుపర్చగా విచారించిన న్యాయమూర్తి మూడురోజుల జైలుశిక్ష విధించారు. అలాగే మరో 30 మందికి రూ. 59,200 జరిమానా విధించారు.