అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని మూడో టౌన్‌ పరిధిలో ఓ జడ్జి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుభాష్‌నగర్‌లోని ఎన్జీవోస్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ జడ్జి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లారు. సదరు ఇంటికి తాళం వేసి ఉంచిన విషయాన్ని గమనించిన దొంగలు గురువారం ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. 25 తులాల బంగారంతో పాటు నగదు అపహరించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.