అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. మృత శిశువు జన్మించాడని రోదిస్తున్న కుటుంబ సభ్యుల హృదయాల్లో ఆనందం నింపాడు. పుట్టిన ఎనిమిది గంటల తర్వాత చలనం రావడంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. స్థానిక కేజీహెచ్ లో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఓ మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆ శిశువులో చలనం లేదు. వైద్యులు రాత్రంతా శ్రమించిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. దుఃఖంలో మునిగిపోయిన తండ్రి శిశువును అంత్యక్రియల కోసం ఒడిలోకి తీసుకొని అంబులెన్స్ లో తరలిస్తుండగా ఒక్కసారిగా శిశువులో చలనం వచ్చింది. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లగా చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.