అక్షరటుడే, వెబ్‌డెస్క్: లంచం తీసుకున్న కేసులో మున్సిపల్ ఏఈకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. 2012లో నగరంలోని సంజయ్ పార్క్ నుంచి విజ్ఞాన్ స్కూల్ వరకు కొత్త రోడ్డు వేసిన అనంతరం కొలతలు వేసేందుకు మున్సిపల్ ఏఈ పోరెడ్డి అశోక్ గుత్తేదారు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో గుత్తేదారు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు అశోక్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారించిన హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టు పోరెడ్డి అశోక్‌కు రెండేళ్ల జైలుశిక్ష, రూ.40,000 జరిమానా విధించింది.
ఏసీబీ కేసులో మున్సిపల్ ఏఈకి జైలుశిక్ష
Advertisement
Advertisement