అక్షరటుడే, జుక్కల్: లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూరుకు చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూర్ మండలం మీర్జాపూర్ వద్ద ఓ యువకుడు లిఫ్ట్ అడిగాడు. ఇద్దరు కలిసి రాజుల్లా వైపు నుంచి బిచ్కుంద వస్తున్నారు. ఈ క్రమంలో రాజుల్లా సమీపంలో బైక్ ఆపి యజమాని మూత్రం పోయడానికి వెళ్లగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్ తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Mla Lakshmikantha Rao | సన్నబియ్యం పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలి