అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని లలితానగర్‌కు చెందిన రాంగోపాల్(57) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలితానగర్‌కు చెందిన రాంగోపాల్ కు కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేదు. కొద్ది రోజులుగా ఆయన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా పెళ్లి నిశ్చయం కాకపోవడంతో మనస్థాపం చెంది ఈ నెల 21న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement